ఒడిశా లోని కంధమల్ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని సుఖాలద గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న భద్రతా దళాలకు మావోయిస్టులు తారాసపడ్డారు. తప్పించుకునే ప్రయత్నంలో మావోయిస్టులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురుకాల్పును ప్రారంభించారు. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. భారీగా పోలీసులు మందుగుండు సామాగ్రి, రైఫిళ్లు, పిస్టోల్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన ఇద్దరు మావోయిస్టులు చందన్, మంకుగా గుర్తించారు. భద్రతా సిబ్బంది దట్టమైన అడవిని జల్లెడపడుతున్నారు. ఆపరేషన్‌ను ఖచ్చితత్వంతో, ధైర్యంగా నిర్వహించినందుకు ఒడిశా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ యోగేష్ బహదూర్ ఖురానియా ఎస్పీ హరీష్ బిసి, డివిఎఫ్ బృందాన్ని అభినందించారు.
ఒడిశా ఎన్‌కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు మృతి
July 01, 2025
0
Tags