మధ్యప్రదేశ్ సియోని జిల్లాలో నదిలో నుంచి చెప్పులు తీసేందుకు ప్రయత్నించిన 20 ఏళ్ల యువకుడు అందులో జారిపడి కొట్టుకుపోయాడు. అతడి స్నేహితులు చూస్తుండగానే నీటిలో మునిగిపోయాడు. సరదాగా పిక్నిక్ వెళ్లిన సమయంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. సోమవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాధిత యువకుడిని ఆయుష్‌గా గుర్తించారు. ఆయుష్ అతడి స్నేహితులతో కలిసి పరేవా ఖో అనే ప్రసిద్ధ ప్రదేశానికి విహారయాత్రకు వెళ్లాడు. ఆ సమయంలో నదిలో అతడి చెప్పు కొట్టుకుపోయింది. దీనిని తిరిగి తీసే క్రమంలో ఆయుష్, ఒక కర్రను ఉపయోగించి నీటిలోకి అడుగు పెట్టాడు. కొట్టుకుపోతున్న చెప్పును కర్రతో ఆపాలని ప్రయత్నించాడు. ఆ సమయంలో అతను జారిపోవడంతో బ్యాలెన్స్ కోల్పోయి నదిలో పడిపోయాడు. మరుసటి రోజు రెస్క్యూ టీం ఆయుష్ మృతదేహాన్ని తెలికి తీసింది.
నదిలో పడిన చెప్పును తీసే క్రమంలో బ్యాలెన్స్ కోల్పోయి నదిలో పడి దుర్మరణం చెందిన యువకుడు
July 20, 2025
0
Tags