కామిక్స్ పుస్తకాల్లో రూ.40 కోట్ల విలువైన కొకైన్ స్మగ్లింగ్ చేస్తూ దొరికిన నిందితుడు

Telugu Lo Computer
0


బెంగళూరు ఎయిర్‌పోర్టులో కామిక్స్‌ పుస్తకాల్లో కొకైన్ దాచి స్మగ్లింగ్‌కు యత్నించిన ఓ వ్యక్తి దొరికిపోయాడు. అతడి నుంచి ఏకంగా రూ.40 కోట్ల విలువైన కొకెయిన్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దోహా నుంచి బయలుదేరిన అతడు జులై 18న ఉదయం బెంగళూరు ఎయిర్‌పోర్టుకు వచ్చిన సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. మాదకద్రవ్యాల అక్రమరవాణా జరుగుతోందన్న సమాచారంతో రంగంలోకి దిగిన డీఆర్ఐ అధికారులు అతడిని తనిఖీ చేశారు. నిందితుడి వెంట ఉన్న కామిక్స్‌ పుస్తకాలు అనుమానాస్పదంగా కనిపించాయి. ఉండవలసిన దానికంటే అధిక బరువు ఉన్న పుస్తకాలను సిబ్బంది తినిఖీ చేయగా నిందితుడి బండారం బయటపడింది. పుస్తకం కవర్స్‌లో ఎవరికీ అనుమానం రాకుండా తెల్లటి పౌడర్‌ను దాచి తరలించేందుకు నిందితుడు ప్రయత్నించినట్టు గుర్తించారు. అనంతరం దీన్ని పరీక్షించగా అది కొకెయిన్ అని తేలింది. మొత్తం 4,006 గ్రాముల కొకైన్ ను నిందితుడు తీసుకొచ్చాడని డీఆర్ఐ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ రూ.40 కోట్లుగా ఉండొచ్చని పేర్కొన్నాయి. ఈ క్రమంలో పోలీసులు నిందితుడిని ఎన్‌డీపీఎస్ చట్టం కింద అరెస్టు చేశారు. అనంతరం కోర్టు అతడికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)