పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం

Telugu Lo Computer
0


రోజు పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు సమావేశమయ్యాయి. తొలుత పహల్గాం ఉగ్రదాడి, ఎయిరిండియా విమాన ప్రమాద మృతులకు ఉభయ సభలు నివాళులర్పించాయి. రాజ్యసభలో కొత్తగా ఎంపికైన నలుగురు ఎంపీలు ప్రమాణస్వీకారం చేశారు. అటు లోక్‌సభలో విపక్షాలు నిరసనకు దిగాయి. 'ఆపరేషన్‌ సిందూర్‌'తో పాటు పలు అంశాలపై చర్చకు పట్టుబడుతూ లోక్‌సభలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. వారి నినాదాల నడుమ స్పీకర్‌ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల గంట చేపట్టారు. ప్రతిపక్ష ఎంపీలు నిరసన విరమించాలని సభాపతి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ వారు వినిపించుకోకపోవడంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత పార్లమెంటు సమావేశాలు జరగడం ఇదే తొలిసారి. నేటినుంచి ఆగస్టు 21 వరకు 21 రోజుల పాటు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ఆపరేషన్‌ సిందూర్‌ సహా అనేక అంశాలపై ప్రశ్నల్ని సంధించడానికి విపక్షాలు మూకుమ్మడిగా సిద్ధమయ్యాయి. తాము లేవనెత్తే అంశాలపై ప్రధాని స్పందించాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే, పార్లమెంటు నియమాలు, సంప్రదాయాలకు అనుగుణంగా 'ఆపరేషన్‌ సిందూర్‌' సహా అన్ని అంశాలు చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ఇప్పటికే స్పష్టం చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)