శ్రీనివాసునికి శంకు, చక్రాలను కానుకగా ఇచ్చిన సుదర్శన్ ఎంటర్‌ప్రైజెస్

Telugu Lo Computer
0


చెన్నైకి చెందిన సుదర్శన్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ తిరుమల శ్రీవారికి విలువైన బంగారు కానుకలను సమర్పించింది. ఈ సంస్థ 2.5 కిలోల బంగారంతో రూపొందించిన శంకు, చక్రాలను శ్రీవారికి భక్తిశ్రద్ధలతో అర్పించింది. వీటి విలువ సుమారు రూ.2.4 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ శంకు, చక్రాలను తిరుమలలోని శ్రీవారి ఆలయంలో రంగనాయకుల మండపంలో తితిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరికి దాతలు హస్తాంతరం చేశారు. తిరుమల శ్రీవారికి వినూత్నంగా చేసిన ఈ బంగారు కానుక భక్తులలో ప్రత్యేక ఆసక్తిని రేపుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)