ఆపరేషన్ సిందూర్‌పై చర్చల్లో శశిథరూర్, మనీశ్ తివారీలను దూరం పెట్టిన కాంగ్రెస్‌ ?

Telugu Lo Computer
0


పరేషన్ సిందూర్‌పై మంగళవారం లోక్‌సభలో చర్చ జరగనుంది. ఈ చర్చల్లో కాంగ్రెస్ నేతలు శశిథరూర్, మనీశ్ తివారీలను పార్టీ దూరం పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తివారీ  ఓ పోస్టుపెట్టారు. అందులో తాను భారత్‌ వైపే మాట్లాడతానని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్‌ గురించి ప్రపంచదేశాలకు వివరించడానికి వెళ్లిన అఖిలపక్ష బృందంలో థరూర్, తివారీ ఉన్నారు. ఈ ఆపరేషన్‌పై జరిగే చర్చలో తమను ఎందుకు దూరం పెట్టారనే దానిపై ఓ వార్తా సంస్థ రాసిన కథనాన్ని తివారీ ఎక్స్‌లో పంచుకున్నారు. దానికి పూరబ్ ఔర్ పశ్చిమ్‌ అనే బాలీవుడ్‌ సినిమాలోని దేశభక్తి గీతంలో కొన్ని వ్యాఖ్యలను జోడించారు. ఒక భారతీయుడిగా తాను దేశ వైభవాన్నే కోరుకుంటాననేది దాని అర్థం. దీనికి ముందు చర్చల్లో తాను మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని తివారీ పార్టీకి అభ్యర్థన కూడా పంపారని పార్టీ వర్గాలు ఓ వార్తా సంస్థకు తెలిపాయి. ఇక, ఆపరేషన్‌పై జరిగే చర్చల్లో థరూర్‌ ఉండాలని కాంగ్రెస్‌ కోరిందని.. అయితే, పార్టీ చెప్పినవిధంగా మాట్లాడాలని కోరినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కానీ, దీనికి ఆయన నిరాకరించినట్లు సమాచారం. దీనిపై విలేకరులు ప్రశ్నించగా మౌనవ్రతం, మౌనవ్రతం అంటూ థరూర్‌ బదులిచ్చారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)