స్టార్‌లింక్‌ గరిష్ఠంగా 20 లక్షల కనెక్షన్లకు మాత్రమే సేవలందిస్తుంది !

Telugu Lo Computer
0


భారత్‌లో స్టార్‌లింక్‌ గరిష్ఠంగా 20 లక్షల కనెక్షన్లకు మాత్రమే సేవలందించగలదని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు. ఇది గరిష్ఠంగా 200 ఎంబీపీఎస్‌ స్పీడ్‌ను అందిస్తుందని, అంతేకాకుండా ప్రభుత్వరంగ టెలికాం సంస్థ అయిన బీఎస్ఎన్‌ఎల్‌తో పాటు ఇతర టెలికాం సంస్థలపై దీని ప్రభావం తక్కువగానే ఉంటుందని పేర్కొన్నారు. స్టార్‌లింక్‌ సేవల ప్రారంభ ఖర్చు ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. నెలవారీ ఛార్జీలు సుమారు రూ.3 వేల వరకు ఉండొచ్చని ఆయన తెలిపారు. బీఎస్‌ఎన్ఎల్‌ విస్తృతంగా సేవలందించే గ్రామీణ, మారుమూల ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఈ శాట్‌కామ్‌ సేవలందించాలని భావిస్తున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ సేవల విస్తరణ పూర్తయినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం టారిఫ్‌లు పెంచే ప్రతిపాదనలు లేవని స్పష్టం చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)