సీనియర్ నటి పద్మభూషణ్ గ్రహీత పి.సరోజినీదేవి కన్నుమూత

Telugu Lo Computer
0


సీనియర్ నటి పద్మభూషణ్ గ్రహీత పి.సరోజినీదేవి బెంళూరులోని తన నివాసంలో సోమవారం ఉదయం ఆమె కన్నుముశారు. తెలుగు, కన్నడ, తమిళ్ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించారు. 1942లో కర్ణాటకలో జన్మించిన సరోజాదేవి 13 ఏళ్ల వయసులోనే హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. 200కు పైగా సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకముద్ర వేసుకుంది. తెలుగు, తమిళ్ సినిమాలతో లక్షలాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న ఈమె మొదటి సినిమా మహాకవి కాళిదాస. 1955 నుంచి 84 మధ్య 29 ఏళ్ల పాటు వరుసగా 121 సినిమాల్లో హీరోయిన్‌గా నటించి అరుదైన ఘనత సాధించింది. సినీ రంగానికి ఆమె చేసిన సేవలకు గాను పద్మశ్రీ, పద్మభూషణ్ తో భారత ప్రభుత్వం ఆమెను సత్కరించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)