కేసీఆర్‌తో హరీష్‌రావు కేటీఆర్ కీలక భేటీ

Telugu Lo Computer
0


బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకంట్ల చంద్రశేఖర్‌రావుని  నందినగర్ నివాసంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు ఇవాళ కలిశారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. తాజా రాజకీయ పరిణామాలపై కేసీఆర్‌తో కేటీఆర్, హరీష్‌రావు చర్చించారు. ఎమ్మెల్సీ కవితపై తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు కూడా చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాగా ఎమ్మెల్సీలు తీన్మార్ మల్లన్న, కల్వకుంట్ల కవిత మధ్య రాజకీయంగా వైరం నడుస్తోంది. సంగారెడ్డిలో జరిగిన బీసీల ఆత్మీయ సమావేశంలో ఇటీవల మల్లన్న పాల్గొన్నారు. ఆ సభలో కవితపై మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారు. బీసీలతో కవితకి ఏం సబంధమని మల్లన్న ప్రశ్నించారు. బీసీల రిజర్వేషన్‌లపై రేవంత్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువస్తే కవిత సంబురాలు ఎందుకు చేసుకుంటుందని నిలదీశారు. ఈ క్రమంలో మల్లన్న వ్యాఖ్యలను కవిత తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలోనే నిన్న(ఆదివారం) మల్లన్నకి సంబంధించిన క్యూ న్యూస్ మీడియా కార్యాలయంపై తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేశారు.ఈ దాడిలో జాగృతి కార్యకర్తకి గాయాలయ్యాయి. ఆ తర్వాత కవిత, మల్లన్నలు పోటాపోటీగా ఆరోపణలు చేసుకున్నారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి ఎమ్మెల్సీగా మల్లన్నని సస్పెండ్ చేయాలని కోరారు. ఈ పరిణామాలతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ను కేటీఆర్, హరీష్‌రావు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)