ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏఐ ప్లస్ క్యాంపస్ ఏర్పాటు కానుంది. 7000 మంది విద్యార్థులకు అవకాశం కల్పించేలా కేంద్రాన్ని తీర్చిదిద్దుతామని బిర్లా ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్-బిట్స్ విశ్వవిద్యాలయ కులపతి, పారిశ్రామికవేత్త కుమార కుమార మంగళం బిర్లా వెల్లడించారు. ఇది రానున్న రెండేళ్ల కాలంలో అందుబాటులోకి రానుంది.అమరావతి క్యాంపస్‌ను ఆధునిక సాంకేతిక విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. కృత్రిమ మేథ, డేటా సైన్స్, రోబోటిక్స్, కంప్యుటేషనల్ లింగ్విస్టిక్స్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ తదితర కోర్సులకు ప్రాధాన్యమిస్తామని వెల్లడించారు. కాగా, రెండు దశల్లో ఏడు వేల మంది విద్యార్ధులకు అవకాశం కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించారు. దేశంలో ఇప్పటివరకు ఎక్కడా ఇలాంటి క్యాంపస్ లేదని ఆయన తెలిపారు. దేశంలో ఉన్నత విద్య దిశను మార్చేందుకు తొలి అడుగుగా ఈ క్యాంపస్‌ను తీర్చిదిద్దుతామన్నారు. అమరావతిలో రెండే ళ్లు, విదేశీ విశ్వవిద్యాలయాల్లో రెండేళ్లు అభ్యసించేలా డిజైన్ చేస్తున్నామని జాయింట్ పీహెచ్‌డీలు చేయొచ్చని బిర్లా వివరించారు. అమరావతి క్యాంపస్ దేశంలోనే మొదటి ఏఐ క్యాంపస్ కాబోతోంద ని కంప్యూటర్ సైన్సులోని అన్ని ముఖ్యమైన ప్రోగ్రామ్స్ అక్కడ ఉంటాయని ఉపకులపతి రామ గోపాలరావు చెప్పారు. వివిధ మైనర్ ప్రోగ్రామ్స్‌ను అందుబాటులోకి తెస్తున్నామని అన్నారు. వ్యవసాయం నుంచి వాతావరణం, ఆరోగ్య సంరక్షణ వరకు అన్ని రంగాల కోర్సులకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఐవోటీ, ఏఐ ఆధారిత సేవలతో డిజిటల్ ఫస్ట్ క్యాంపస్ రూపు దిద్దుకుంటుందని వివరించారు. క్యాంపస్ ఏర్పాటుకు సీఐర్డీఏ 70 ఎకరాలు కేటాయించింది.
అమరావతిలో దేశంలోనే తొలి ఏఐ యూనివర్సిటీ
July 14, 2025
0
Tags