వాట్సాప్ డిలీట్ మెసేజ్‌లు ఎలా చూడాలి ?

Telugu Lo Computer
0


వాట్సాప్ లో చాట్ చేయడం నుంచి వీడియో కాల్స్ వరకు అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలోనే వాట్సాప్ తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు అనేక ఫీచర్లను అందిస్తోంది. అయితే ఓ ఫీచర్ మాత్రం పలువురు యూజర్లకు ఇబ్బందికరంగా మారింది. అదే డిలీట్ ఫర్ ఎవ్రీవన్. ఈ ఫీచర్ ద్వారా అనుకోకుండా పంపిన మెసేజ్‌ను వెంటనే డిలీట్ చేయవచ్చు. కానీ, ఆ డిలీట్ చేసిన మెసేజ్‌లో ఏముందో తెలుసుకోవాలని ఆ గ్రూపులోని సభ్యులు ఆలోచిస్తుంటారు. మరోవైపు ప్రియురాలు లేదా ప్రియుడికి మెసేజ్ చేసి డిలీట్ చేసినప్పుడు ఏం పంపించి డిలీట్ చేశారో అనే ఆసక్తి వారికి ఉంటుంది. దీంతో ఏం డిలీట్ చేశారో చెప్పాలంటూ ఆరా తీస్తుంటారు. దీంతో ఈ ఫీచర్ వల్ల అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. కానీ ఈ సమస్యకు ఓ పరిష్కారం ఉందని అనేక మందికి తెలియదు. ఒక చిన్న సెట్టింగ్ ఆన్ చేస్తే డిలీట్ చేసిన మెసేజ్‌లను సులభంగా చూసుకునే అవకాశం ఉంది.  అలాంటి డిలీట్ చేసిన మెసేజ్‌లను చూడటానికి ఎలాంటి థర్డ్-పార్టీ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం స్మార్ట్‌ఫోన్‌లో ఒక సెట్టింగ్‌ను ఆన్ చేస్తే సరిపోతుంది. ఈ సెట్టింగ్ ద్వారా డిలీట్ చేసిన మెసేజ్‌లను 24 గంటలపాటు సులభంగా చూసుకోవచ్చు. దీని కోసం మీ స్మార్ట్‌ఫోన్‌లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి నోటిఫికేషన్ ఆప్షన్‌కు వెళ్లితే ఇక్కడ నోటిఫికేషన్ హిస్టరీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్‌ను ఆన్ చేయాలి. ఇది ఆన్ అయిన తర్వాత వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను 24 గంటలపాటు సులభంగా చూసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్ అన్ని స్మార్ట్‌ఫోన్లలో అందుబాటులో ఉండదు. ఇది ఆండ్రాయిడ్ 11 లేదా ఇతర వెర్షన్‌లలో పనిచేసే స్మార్ట్‌ఫోన్లలో మాత్రమే లభిస్తుంది. ఐఫోన్ యూజర్లు ఈ ఫీచర్‌ను ఉపయోగించలేరు. ఈ ఫీచర్ కేవలం ఆండ్రాయిడ్ యూజర్ల కోసం మాత్రమే. ఈ ఫీచర్ పేరు ప్రతి స్మార్ట్‌ఫోన్‌లో కొద్దిగా భిన్నంగా ఉండవచ్చు. కాబట్టి, మీ ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఈ ఆప్షన్‌ను చెక్ చేయండి. ఈ సెట్టింగ్ ఆన్ చేసిన తర్వాత మీరు కేవలం మెసేజ్‌లను మాత్రమే చూడగలరు. డిలీట్ చేసిన ఫోటోలు లేదా వీడియోలను ఈ ఫీచర్ ద్వారా చూడలేరు. ఈ ఫీచర్ ద్వారా 24 గంటల వరకు నోటిఫికేషన్ హిస్టరీలో చూడవచ్చు. అంతకంటే ఎక్కువ కాలం ఉండవు.

Post a Comment

0Comments

Post a Comment (0)