బయటికి ఒక మాట - లోపల ఒక మాట మాట్లాడటం రాదు !

Telugu Lo Computer
0


తెలంగాణలోని హుజూరాబాద్ నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు శామీర్‌పేటలోని ఈటల నివాసానికి శనివారం తరలివచ్చారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్గం మమ్మల్ని దూరం పెడుతున్నారని, పార్టీ పదవుళ్లలో అవకాశం ఇవ్వడం లేదని ఈటల దృష్టికి తీసుకువెళ్ళారు. ఈ సందర్బంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ కాలం చాలా గొప్పదన్నారు. మనకు మనంగా బీఆర్ఎస్ నుంచి బయటకు రాలేదనీ వెళ్లగొట్టారనీ తెలిపారు. రాజకీయాల్లో అవమానాలు, అవహేళనలు ఉంటాయి. తట్టుకున్నాం 2021 నుండి బీఆర్ఎస్‌లో నరకం అనుభవించానని గుర్తు చేశారు. కానీ ప్రజలు ఎప్పుడూ మోసం చేయరు. సైకో, శాడిస్ట్, ఎవడో, ఎవరి అండతో ధైర్యం చేశాడో అర్థం అవుతుందని తెలిపారు. తాను శత్రువుతో నేరుగా కోట్లాడతానని ఈటల స్పష్టం చేశారు. కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకోవడం రాదన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగు పడని పల్లె లేదనీ, నా చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసు అని, ధీరుడు వెనుదిరగడు. ఎంత వరకు ఓపిక పట్టాలో తెలుసు అని రాజేందర్ ఫైర్ అయ్యారు. హుజురాబాద్‌లో గత 20 ఏళ్లుగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోలేదన్నారు. హుజురాబాద్‌లో 2019 లోకసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 53 వేల మెజార్టీ వచ్చింది. వ్యక్తులు ఎదకుండా పార్టీ బలపడలేదు. కార్యకర్తల ఆవేదన అర్థం అయ్యింది. కార్యకర్తలకు రాజకీయ అవసరాలు తీర్చలేనంత నిస్సహాయంగా లేను. నా అనుభవం వాడుకుంటే పార్టీకి ఉపయోగపడుతుంది. పదవులే పరవధిగా భావించే వాడిని కాదు. ఏ పార్టీలో పనిచేస్తే ఆ పార్టీకి అంకితభావంతో పనిచేస్తానని రాజేందర్ స్పష్టం చేశారు. కురుస స్వభావులు మిమ్మల్ని చూసి నవ్వాలో, ఏడవాలో తెలియడం లేదు. కొత్త, పాత వాళ్ళు అనే భావన లేదు. ఎవరి దయాదక్షిణ్యాలు అవసరం లేదు. కోవర్టులు రాజకీయాల్లోనే కాదు అన్నింట్లో ఉంటారు. వారి గురించి బాధపడకండనీ పార్టీ నాయకులకు భరోసా ఇచ్చారు. హుజురాబాద్ వస్తా, మీ వెంటే ఉంటా.  మిమ్మల్ని గెలిపించుకుంటాని హామీ ఇచ్చారు. పదిరోజులకు ఒకసారి హుజురాబాద్ వస్తా.. నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రంలో ఆఫీస్ ఉంటుందన్నారు. కార్యకర్తలు కుంగిపోవద్దనీ మీకు నేను అండగా ఉంటానని తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)