ట్రినిడాడ్-టొబాగోలో నరేంద్ర మోడీకి గార్డ్ ఆఫ్ హానర్ !

Telugu Lo Computer
0


ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ట్రినిడాడ్-టొబాగో చేరుకున్నారు. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని పియార్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు గార్డ్ ఆఫ్ హానర్ లభించింది. ఆ దేశ ప్రధాన మంత్రి కమలా ప్రసాద్-బిస్సేస్సార్ సహా 38 మంది మంత్రులు, నలుగురు పార్లమెంటు సభ్యులు ఎయిర్‌పోర్టుకు తరలివచ్చి ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సమయంలో ట్రినిడాడ్-టొబాగో ప్రధాన మంత్రి భారతీయ దుస్తులలో కనిపించడం విశేషం. 1999 తర్వాత భారత ప్రధాని చేసిన తొలి అధికారిక పర్యటన కూడా ఇదే కావడం విశేషం. ట్రినిడాడ్-టొబాగో ప్రధానమంత్రి కమలా ప్రసాద్-బిస్సేస్సార్ ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగుతోంది. ప్రధాని మోడీ పర్యటన పట్ల ప్రజల్లో విపరీతమైన ఉత్సాహం నెలకొంది. విమానాశ్రయంలో భారతీయ సంస్కృతి వెల్లువిరిసింది. భారత సంతతికి చెందిన ప్రజలు తమ చేతుల్లో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. ప్రతి ఒక్కరిని ప్రధాని మోడీ అప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా సాంప్రదాయ నృత్యం కూడా ప్రదర్శించారు. ఈ పర్యటనలో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ప్రధాని మోదీ ట్రినిడాడ్-టొబాగో అగ్ర నాయకత్వంతో చర్చలు జరుపుతారు. రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రధాని మోదీ అధ్యక్షురాలు క్రిస్టీన్ కార్లా కంగలు, ప్రధాన మంత్రి కమలా ప్రసాద్-బిస్సేసర్‌లతో సమావేశమవుతారు.

Post a Comment

0Comments

Post a Comment (0)