తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు చేసిన భారత్

Telugu Lo Computer
0


ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో  టెస్ట్ మ్యాచ్ లో ఓవర్‌నైట్‌ స్కోరు 310/5తో ఆట కొనసాగించిన భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 151 ఓవర్లలో 587 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్‌ క్రికెట్‌లో స్టోక్స్‌-మెకల్లమ్‌ (బజ్‌బాల్‌) శకం మొదలైన తర్వాత ఆ జట్టుపై ప్రత్యర్థి సాధించిన అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం. టీమిండియా కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్స్‌లు) అసాధారణ బ్యాటింగ్‌ ప్రదర్శన కనబర్చగా, రవీంద్ర జడేజా (137 బంతుల్లో 89; 10 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీ చేజార్చుకున్నాడు. వాషింగ్టన్‌ సుందర్‌ (103 బంతుల్లో 42; 3 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆరో వికెట్‌కు జడేజాతో 203 పరుగులు జోడించిన గిల్‌... ఏడో వికెట్‌కు సుందర్‌తో 144 పరుగులు జత చేశాడు. అనంతరం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లలో 3 వికెట్లకు 77 పరుగులు చేసింది. ఫాలోఆన్‌ తప్పించుకునేందుకు కూడా ఆ జట్టు మరో 311 పరుగులు చేయాల్సి ఉంది. మ్యాచ్‌ రెండో రోజు తొలి బంతికి సింగిల్‌తో గిల్, జడేజా భాగస్వామ్యం 100 పరుగులకు చేరింది. అనంతరం 80 బంతుల్లో జడేజా అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా ధాటిని పెంచిన గిల్‌ టెస్టుల్లో తన అత్యధిక స్కోరును అందుకోవడంతో పాటు కెరీర్‌లో తొలిసారి 150 పరుగులు (263 బంతుల్లో) దాటాడు. ఆ తర్వాత మరింత జోరు ప్రదర్శించిన వీరిద్దరు బషీర్‌ ఓవర్లో చెరో సిక్స్‌ బాదారు. ఇదే ఊపులో శతకం దిశగా దూసుకుపోయిన జడేజా దురదృష్టవశాత్తూ ఆ అవకాశం కోల్పోయాడు.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) స్మిత్‌ (బి) స్టోక్స్‌ 87; రాహుల్‌ (బి) వోక్స్‌ 2; కరుణ్‌ నాయర్‌ (సి) బ్రూక్‌ (బి) కార్స్‌ 31; గిల్‌ (సి) పోప్‌ (బి) టంగ్‌ 269; పంత్‌ (సి) క్రాలీ (బి) బషీర్‌ 25; నితీశ్‌ రెడ్డి (బి) వోక్స్‌ 1; జడేజా (సి) స్మిత్‌ (బి) టంగ్‌ 89; సుందర్‌ (బి) రూట్‌ 42; ఆకాశ్‌దీప్‌ (సి) డకెట్‌ (బి) బషీర్‌ 6; సిరాజ్‌ (స్టంప్డ్‌) స్మిత్‌ (బి) బషీర్‌ 8; ప్రసిధ్‌ (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు 22; మొత్తం (151 ఓవర్లలో ఆలౌట్‌) 587.

వికెట్ల పతనం:1-15, 2-95, 3-161, 4-208, 5-211, 6-414, 7-558, 8-574, 9-574, 10-587.

బౌలింగ్‌: వోక్స్‌ 25-6-81-2, కార్స్‌ 24-3-83-1, టంగ్‌ 28-2-119-2, స్టోక్స్‌ 19-0-74-1, బషీర్‌ 45-2-167-3, రూట్‌ 5-0-20-1, బ్రూక్‌ 5-0-31-0.

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: క్రాలీ (సి) నాయర్‌ (బి) సిరాజ్‌ 19; డకెట్‌ (సి) గిల్‌ (బి) ఆకాశ్‌దీప్‌ 0; పోప్‌ (సి) రాహుల్‌ (బి) ఆకాశ్‌దీప్‌ 0; రూట్‌ (బ్యాటింగ్‌) 18; బ్రూక్‌ (బ్యాటింగ్‌) 30; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 77.

వికెట్ల పతనం:1-13, 2-13, 3-25.

బౌలింగ్‌: ఆకాశ్‌దీప్‌ 7-1-36-2, సిరాజ్‌ 7-2-21-1, ప్రసిధ్‌ కృష్ణ 3-0-11-0, నితీశ్‌ రెడ్డి 1-0-1-0, జడేజా 2-1-4-0. 


Post a Comment

0Comments

Post a Comment (0)