దేశంలోనే కాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ పెద్దది : రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్

Telugu Lo Computer
0


తెలంగాణలోని హనుమకొండ జిల్లా కాజీపేట మండలంలో 750 కోట్ల రూపాయలతో రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. పనుల పరిశీలన నిమిత్తం ఇవాళ కేంద్రమంత్రి యూనిట్ ను సందర్శించారు. తెలంగాణలో ఇదో పెద్ద ప్రాజెక్టు అని, ఈ ప్రాజెక్ట్ వల్ల చాలా మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. దేశంలోనే ఇది పెద్ద రైల్వే మానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని, వందేభారత్ బోగీలు కూడా ఇక్కడే తయారవుతాయని మంత్రి వెల్లడించారు. ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో భారతీయ రైల్వేలు పురోగమిస్తున్నాయని మంత్రి వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)