ఏటా డీఎస్సీ నిర్వహించి టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తాం : మంత్రి నారా లోకేశ్‌

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో ఏడేళ్ల తర్వాత విజయవంతంగా మెగా డీఎస్సీ చేపట్టామని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. పకడ్బందీగా పరీక్షలు ప్రారంభించిన యంత్రాంగానికి అభినందనలు చెప్పారు. ఇకపై ఏటా డీఎస్సీ నిర్వహించి టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. పారదర్శకంగా బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ కూడా ప్రారంభించామన్నారు. మొట్టమొదటిసారిగా నాలుగు వేల మందికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించామని గుర్తు చేశారు. నూరుశాతం అక్షరాస్యత కోసం ప్రాజెక్ట్ అ-ఆ (అక్షర ఆంధ్ర) ప్రారంభించినట్లు వెల్లడించారు. విద్యాశాఖ అధికారులతో మంత్రి నారా లోకేశ్‌ సమీక్ష నిర్వహించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)