కెనడాలోని అల్బెర్టాలో ఈ నెల 15 నుంచి 17 వరకు జరగనున్న జీ7 సదస్సుకు భారత్‌కు ఆహ్వానం అందింది. ఈ మేరకు ప్రధాని మోడీకి కెనడా ప్రధాని మార్క్ కార్నే ఫోన్ చేసి సదస్సులో పాల్గొనాలని ఆహ్వానించారు. ఈ విషయాన్ని మోడీ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. కార్నేతో ఫోన్‌లో మాట్లాడటం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన్ను అభినందించినట్లు తెలిపారు. భారత్, కెనడా శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశాలన్న మోదీ.. పరస్పర ఆసక్తులను గౌరవించుకుంటూ పని చేస్తామన్నారు. మార్క్ కార్నేతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. 51వ జీ-7 సదస్సుకు కెనడా ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. జీ7 దేశాల్లో భారత్ లేకున్నప్పటికీ.. నిర్వహణ దేశాల ఆహ్వానం మేరకు మన ప్రధాని ఆ శిఖరాగ్ర సదస్సుల్లో పాల్గొంటున్నారు.
జీ-7 సదస్సుకు భారత్‌కు ఆహ్వానం
June 06, 2025
0
Tags