కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యవసాయంతో పాటు విద్యా వ్యవస్థ కూడా కుంటుపడింది : కేటీఆర్

Telugu Lo Computer
0


తెలంగాణలో రైతు భరోసా కోసం రైతుల ఎదురుచూపులు, బాగ్ లింగంపల్లిలోని మైనార్టీ గురుకుల గేటుకు యజమాని తాళం వేసిన ఘటనలపై దినపత్రికల్లో వచ్చిన కథనాలను కేటీఆర్ ఇవాళ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యవసాయంతో పాటు విద్యా వ్యవస్థ కూడా కుంటుపడింది. ఈ ప్రభుత్వానికి వ్యవసాయ రంగం పట్ల నిబద్ధత, విద్యావ్యవస్థ పట్ల బాధ్యత లేదు. వానాకాలం సీజన్ మొదలవుతున్నా రైతుభరోసా అమలు విషయంలో ప్రణాళిక లేదు. పాఠశాలలు ప్రారంభమైనా పాలకులు నిర్లక్ష్యం వీడటం లేదు. అరకొర రుణమాఫీ, ఆచూకి లేని రైతు భరోసా, అదని రైతు బీమా, ప్రాజెక్టుల పడావు' అంటూ కేటీఆర్ రాసుకొచ్చారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయం పండగలా మారితే ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో తిరోగమనం వైపు పయనిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. వెయ్యికిపైగా సంక్షేమ గురుకులాల ఏర్పాటుతో ఎవరెస్టు శిఖరం అధిరోహించిన తెలంగాణ విద్యావ్యవస్థ నేడు కాంగ్రెస్ ఏడాదిన్నపాలనలో అవస్థలు ఎదుర్కొంటోందని కేటీఆర్ విమర్శించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)