ఎమ్మెల్యే అనుచరులపై తిరగబడ్డ యాకత్‌పుర ప్రజలు

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని యాకత్‌పుర ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్‌ మేరాజ్‌పై ఓల్డ్ సిటీలోని స్థానికులు తిరగబడ్డారు. మౌలా కా చిల్లా ప్రాంతంలో నాలా పనులు పెండింగ్ ఉండటంతో తమ ఇళ్లల్లోకి నీళ్లు వస్తున్నాయని గతంలో ఎమ్మెల్యేకు స్థానికులు ఫిర్యాదులు చేశారు. అయితే ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్ పట్టించుకోలేదు. దీంతో ఎమ్మెల్యేపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిన్న వర్ష ప్రభావిత ప్రాంతాల్లో తిరుగుతూ మౌలా కా చిల్లా ప్రాంతంలో నాలా పనులను ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్‌ పరిశీలించారు. అయితే ఈ సమయంలో నాలా పనులపై ఎమ్మెల్యేని స్థానికులు నిలదీశారు. ఎమ్మెల్యేతో అలా ఎలా మాట్లాడుతారంటూ స్థానికులపై ఎమ్మెల్యే అనుచరులు దాడికి దిగారు. ఎమ్మెల్యే అనుచరులపై స్థానికులు తిరగబడ్డారు. ఈ క్రమంలో ఒకరిపై మరొకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. వర్షాకాలం వచ్చినా నాలా పనులు పూర్తి చేయించలేని ఎమ్మెల్యే ఉండి ఎందుకని స్థానికులు ప్రశ్నించారు. తమ సమస్యలపై ఎమ్మెల్యేని ప్రశ్నిస్తే, అనుచరులతో దాడి చేయిస్తారా అని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ప్రజల తిరుగుబాటుతో ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్‌కి ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు.

Post a Comment

0Comments

Post a Comment (0)