ఎగువ రాష్ట్రాలకు పోలవరం-బనకచర్లతో ఎలాంటి నష్టం లేదు : నిమ్మల రామానాయుడు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై సచివాలయంలో పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ చేస్తూ దీని వల్ల ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేదన్నారు. ఏటా గోదావరి నుంచి మూడు వేల టీఎంసీలు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఆయన వివరించారు. ''ప్రపంచంలోనే ఒక నదిలో ఒకే సమయంలో 50 లక్షల క్యూసెక్కులు ప్రవహించే నది గోదావరి. పోలవరం వద్ద లభ్యమయ్యే గోదావరి వరద జలాలను మాత్రమే ఉపయోగించుకుంటాం. వృథాగా సముద్రంలోకి పోయే నీటిని మాత్రమే బనకచర్లకు తరలిస్తాం. ఎక్కడా నికర జలాలను వాడట్లేదని స్పష్టంగా చెబుతున్నాం. ఎగువ రాష్ట్రాలకు కేటాయించిన నీటిని వాడుకునే పరిస్థితి లేదు'' అని ఆయన వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)