భర్తతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో టీచర్‌పై దాడికి దిగిన ప్రభుత్వ ఉద్యోగిని

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరులో తన భర్తతో వివాహేతర సంబంధం కలిగి ఉందేమోననే అనుమానంతో ఓ ప్రభుత్వ మహిళా ఉద్యోగి మరో మహిళ టీచర్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ వీడియో వైరల్‌ కావడంతో ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు రామకృష్ణాపురంలో నివాసం ఉంటున్న బొల్లె సుజాత ప్రైవేట్‌ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆమె కళాశాలలో చదువుకునే సమయంలో మెరుగు నాని అనే వ్యక్తితో ప్రేమ వ్యవ హారం నడించింది. అయితే వీరి వివాహానికి పెద్దలు నిరాకరించడంతో వీరిద్దరూ వేర్వేరుగా వివాహాలు చేసుకున్నారు. అనంతరం నానికి ప్రభుత్వ మహిళా ఉద్యోగి జయశ్రీతో వివాహమైంది. ఈ నేపథ్యంలో సుజాత అనే మహిళతో నానికి వివాహేతర సంబంధం కొనసాగుతుందని కొందరు చెప్పడంతో జయశ్రీ అనుమానం పెంచుకుంది. ఈ క్రమంలో గత శనివారం సాయంత్రం సుజాత తారసపడడంతో జయశ్రీ దాడికి పాల్పడింది. అటుగా వెళుతున్న పోలీస్‌ సిబ్బంది వారించినా ఆమె వినకుండా దాడి చేసింది. బాధిత మహిళ సుజాత సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో తనపై దాడిని పేర్కొంటూ ప్రాణహాని ఉందనీ, రక్షణ కల్పించాలని కోరుతూ ఏలూరు జిల్లా ఎస్పీ శివకిషోర్‌కు ఫిర్యాదు చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)