ఇరాన్ క్షిపణి దాడిలో ఇజ్రాయెల్ లోని సోరోకా ఆసుపత్రి ధ్వంసం

Telugu Lo Computer
0

రాన్ క్షిపణి దాడిలో ఇజ్రాయెల్ లోని సోరోకా ఆసుపత్రి ధ్వంసమైంది. ఈ మిస్సైల్ నేరుగా ఆసుపత్రిపై ఢీ కొట్టింది. ఫలితంగా భవనం నేలమట్టమైంది. నిప్పులు చిమ్ముతూ దూసుకొచ్చి బాలిస్టిక్ మిస్సైల్ నేరుగా ఆసుపత్రి భవనాన్ని తాకింది. ఆ వెంటనే పెద్ద శబ్దం చేస్తూ భవనం నేలమట్టమైంది. పలువురు పేషెంట్లు తీవ్రంగా గాయపడ్డారు. దీనితో పాటు టెల్ అవీవ్, రమత్ గాన్, హ్యాలోన్‌ లల్లో కూడా క్షిపణి దాడులు సంభవించినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది. టెల్ అవీవ్ దక్షిణాన ఉన్న హ్యాలోన్‌ లోని ఓ నివాస భవనంపై మిస్సైల్ పడటంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయని వోల్ఫ్‌ సన్ మెడికల్ సెంటర్ తెలిపింది. రమత్ గాన్‌లో జరిగిన దాడిలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని హీబ్రూ మీడియా పేర్కొంది. 24 గంటల వ్యవధిలో ఇరాన్ తన ప్రతిదాడులను తీవ్రతరం చేసిందని, సుమారు 20 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు వివరించింది. సొరొకా ఆసుపత్రిపై దాడి చోటు చేసుకోవడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని ఐడీఎఫ్ పేర్కొంది. సోరోకా ఆసుపత్రిలో ప్రమాదకరమైన కెమికల్స్ లీకేజ్ ఏర్పడినట్లు ఇజ్రాయెల్ ఛానెల్ 12 తెలిపింది. ఈ అనుమానంతో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేస్తున్నారని వెల్లడించింది. ఆసుపత్రిపై దాడి పట్ల ఇజ్రాయెల్ ఆరోగ్య శాఖ మంత్రి యూరియెల్ బుసో ఘాటుగా స్పందించారు. దీన్ని ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. ఇరాన్ గీత దాటిందని, దీనికి తగిన మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అమాయక పౌరులు, డాక్టర్లు, మెడికల్ స్టాఫ్ ను ఇరాన్ ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)