రొమ్ము క్యాన్సర్‌పై అవేర్‌నెస్‌ క్యాంపెయిన్‌ను ప్రారంభించిన ఉపాసన !

Telugu Lo Computer
0


ఫ్యూజీ ఫిల్మ్ ఇండియా 'త్వరగా గుర్తించండి- త్వరగా పోరాడండి' అనే నినాదంతో సీఎస్‌ఆర్‌లో భాగంగా నేషనల్‌ బ్రెస్ట్‌ క్యాన్సర్ అవేర్‌నెస్‌ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని అపోలో సీఎస్‌ఆర్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌ ఉపాసన ప్రారంభించారు. ప్రచార లోగోను ఆవిష్కరించారు. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించి, దాన్ని త్వరగా గుర్తించాల్సిన అవసరాన్ని వివరిస్తూ ప్రచారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ ''వైద్యరంగంలో చికిత్స చేయడమే కాకుండా కొన్ని వ్యాధులను ముందుగా గుర్తించి, వాటిపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా ఎంతో ముఖ్యమైనది. తగిన సమాచారం లేకపోవడం, త్వరగా చికిత్స పొందడానికి వనరులు అందుబాటులో లేకపోవడంతో చాలామంది మహిళలు రొమ్ము క్యాన్సర్‌ బారినపడి మరణిస్తున్నారు. ఈ వాస్తవాన్ని లోతుగా అర్థం చేసుకునేందుకు ఫ్యూజిఫిల్మ్ ఇండియా చేపట్టిన ఈ సీఎస్ఆర్ ప్రచారం ఉపయోగపడుతుంది. ఆలస్యం కాకముందే మహిళలకు తగిన అవగాహన కల్పించడానికి మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది'' అని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)