ఫోన్ పే, గూగుల్ పే, ఇతర యూపీఐల ద్వారా రూ.3 వేలకుపైగా చేసే లావాదేవీలపై ఛార్జీలు విధించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. అయితే చిన్న మొత్తాల యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీల మినహాయింపు కొనసాగే అవకాశం ఉనట్లు తెలుస్తోంది. పెద్ద వ్యాపారులపై 0.3 శాతం ఎండీఆర్ విధించాలని పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కేంద్రానికి ప్రతిపాదనలు చేసింది. ప్రస్తుతం క్రెడిట్, డెబిట్ కార్డులపై ఎండీఆర్ 0.9 శాతం నుంచి 2 శాతం వరకు ఉంది. ఇక రూపే కార్డులపై ప్రస్తుతానికి ఎండీఆర్ విధించే ఆలోచన లేనట్లు సమాచారం. యూపీఐల ద్వారా రూ.3 వేలకుపైగా చేసే లావాదేవీలపై ఛార్జీలను మరో రెండు మూడు నెలల్లో విధించనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకోబోతున్న ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా లక్షలాది మంది డిజిటల్ పేమెంట్స్ యూజర్లపై ప్రభావం పడనుంది.
యూపీఐ పేమెంట్స్ లావాదేవీలపై ఛార్జీలు ?
June 11, 2025
0
Tags