అమెరికాలోని స్టాక్ మార్కెట్‌లో బోయింగ్ కంపెనీ షేర్లపై తీవ్ర ప్రభావం చూపింది. గురువారం ఉదయం అమెరికా ప్రీ-మార్కెట్ ట్రేడింగ్‌లో బోయింగ్ షేర్లు 8% కంటే ఎక్కువగా పడిపోయాయి. ఒక్కో షేరు ధర సుమారు $196.50 వద్ద నమోదైంది. ఇది $17.50 లేదా 8.18% తగ్గుదలను సూచిస్తుంది. ఈ ఘటన భారతదేశ ఆర్థిక మార్కెట్‌పై కూడా ప్రభావం చూపించింది. ఈ క్రమంలో బడ్జెట్ ఎయిర్‌లైన్స్ అయిన ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో), స్పైస్‌జెట్ షేర్లు గురువారం నాడు 3.4% వరకు పడిపోయాయి. భారత స్టాక్ మార్కెట్ మొత్తం మీద భారీ నష్టాలతో ముగిసింది. గురువారం ట్రేడింగ్ సెషన్ భారతీయ స్టాక్ మార్కెట్‌కు కఠినమైన సవాలుగా మారింది. గ్లోబల్ అనిశ్చితులు, మధ్య ప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, వీక్లీ F&O ఎక్స్‌పైరీ వంటి అంశాలు కూడా మార్కెట్‌ను మరింత ఒత్తిడికి గురిచేశాయి. ఐటీ రంగ షేర్లు భారీగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొనడంతో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు దాదాపు 1% పడిపోయాయి. మధ్యాహ్నం 2:06 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా క్షీణించి 81,605.82 వద్ద రోజు గరిష్ఠ కనిష్ఠ స్థాయికి చేరుకుంది. అదే సమయంలో, ఎన్ఎస్ఈ నిఫ్టీ 250 పాయింట్లకు పైగా పడిపోయి 24,900 మార్కు కంటే తక్కువకు చేరుకుంది. బీఎస్ఈలో జాబితా చేయబడిన అన్ని కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 4.19 లక్షల కోట్లు తగ్గి రూ. 451 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ పతనం అన్ని రంగాల్లో విస్తృతంగా అమ్మకాల ఒత్తిడిని సూచించింది. ఈ విమాన ప్రమాదం కేవలం స్థానిక సమస్య మాత్రమే కాదు. ఇది అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లపై కూడా గణనీయమైన ప్రభావం చూపింది. బోయింగ్ వంటి గ్లోబల్ ఏవియేషన్ దిగ్గజం షేర్లలో ఈ స్థాయి పతనం, విమాన భద్రత, నాణ్యతపై ప్రజల ఆందోళనలను ప్రస్తావిస్తుంది. ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ కావడం ఈ ఘటన తర్వాత బోయింగ్‌పై ఒత్తిడిని మరింత పెరిగింది. ఈ ఘటన ఇండియాలో ఏవియేషన్ రంగంపై ప్రజల విశ్వాసాన్ని ప్రభావితం చేయనుంది. ఇండిగో, స్పైస్‌జెట్ వంటి స్థానిక ఎయిర్‌లైన్స్ షేర్ల పతనం కూడా మార్కెట్‌లో ఆందోళనను చూపిస్తుంది.
గ్లోబల్ మార్కెట్లపై ప్రభావం చూపిన ఇండియాలో ఫ్లైట్ ప్రమాదం
June 12, 2025
0
Tags