చైనా ప్రపంచంలోనే అతి చిన్న సైజు డ్రోన్ లను తయారు చేసింది. దోమ సైజులో ఉండే ఈ డ్రోన్ లు యుద్ధ రంగంలో సమర్థవంతంగా పనిచేస్తాయని చైనా భావిస్తోంది. ఈ డ్రోన్ లను మిలిటరీలో వినియోగించనున్నట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్టు పత్రిక పేర్కొంది. ఈ మైక్రో డ్రోన్ ను చైనాలోని హునాన్ ప్రావిన్స్ లోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీలోని రోబోటిక్ శాస్త్రవేత్తలు రూపొందించారు. చైనా రూపొందించిన ఈ మైక్రో సైజు డ్రోన్ లను మిలిటరీ, డిఫెన్స్ రంగాలతో పాటు అనేక రంగాల్లో వినియోగించవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ డ్రోన్ లకు అసాధారణ శక్తి సామర్థ్యాలు ఉంటాయని తెలిపారు. ఈ మేరకు ఈ డ్రోన్ వివరాలను చైనా మిలిటరీ ఛానెల్ సీసీటీవీ-7 లైవ్ ప్రదర్శన చేసింది. ఈ డ్రోన్ కు దోమ మాదిరి రెండు రెక్కలు, ఆకు ఆకారంలో రెక్కలు ఉన్నాయి. రెండు కాళ్లు ఉన్నాయి. ఈ డ్రోన్ లను యుద్ధరంగంలో ప్రత్యేకమైన ఆపరేషన్స్ ను నిర్వహించేందుకు చైనా వాడనుంది. వీటిని మొబైల్ ఫోన్ ల ద్వారా కంట్రోల్ చేస్తుంది. ఇలాంటి అతి చిన్న డ్రోన్ లు కోవర్టు ఆపరేషన్స్ కు బాగా ఉపయోగపడతాయని చైనా భావిస్తోంది. ఇవి ఎలాంటి వాతావరణ పరిస్థితిని అయినా తట్టుకుని సైనికులకు సమాచారం అందించగలవు. వీటికి చుట్టూ సెన్సార్లు అమర్చారు. ఇవి ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా సమర్థవంతంగా పనిచేస్తాయి. అంతేకాక ఈ డ్రోన్ లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగించి రూపొందించారు. ఈ డ్రోన్ లు గూఢ చర్యం చేయడానికి, శత్రువులపై నిఘా పెట్టడానికి ఉపయోగపడనున్నాయి. ఈ డ్రోన్ లు దోమ సైజులో ఉండటం కారణంగా వీటిని గుర్తించడం శత్రువులకు కష్టంగా అనిపిస్తుంది. దీంతో ఇవి సాధారణంగా తమ పని చేసుకుంటూ వెళ్తాయి. భవిష్యత్తు యుద్ధాల్లో డ్రోన్ లు అత్యంత కీలకం కానున్న నేపథ్యంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు
దోమ సైజులో డ్రోన్ ను తయారు చేసిన చైనా !
June 23, 2025
0
Tags