జియో ఏఎక్స్6000 యూనివర్సల్ రూటర్‌ను లాంచ్

Telugu Lo Computer
0


దేశీయ మార్కెట్లో రిలయన్స్ జియో ఏఎక్స్6000 యూనివర్సల్ రూటర్‌ను లాంచ్ చేసింది. ఈ కొత్త వైఫై 6 రౌటర్ మెష్ టెక్నాలజీతో వస్తుంది. జియో ఫైబర్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ సర్వీస్‌ ద్వారా అందిస్తున్న గరిష్ట ఇంటర్నెట్‌ వేగం 1000 ఎంబీపీఎస్‌ కాగా ఇది 6,000 ఎంబీపీఎస్ వరకు వేగంతో ఇంటర్నెట్‌ను అందిస్తుంది. సుమారు 2,000 చదరపు అడుగుల ప్రాంతాన్ని కవర్ చేస్తుంది. 4కే స్ట్రీమింగ్, గేమింగ్‌కు బాగా సరిపోతుంది. జియో కొత్త వైఫై రౌటర్ జీరో లాగ్ తో 100కు పైగా డివైజ్ లను హ్యాండిల్ చేస్తుందని, డేటా భద్రత కోసం డబ్ల్యూపీఏ3 సపోర్ట్ తో వస్తుందని చెబుతున్నారు. పెద్ద లేదా బహుళ అంతస్తుల ఇళ్లలో మరింత వేగవంతమైన ఇంటర్నెట్‌ కోసం ఈ రౌటర్‌ను రూపొందించారు. ఇది ఆన్‌లైన్ గేమర్లు, బింజ్ వాచర్స్, ఎక్కువ కనెక్టెడ్ పరికరాలను వినియోగించే స్మార్ట్ హోమ్ వినియోగదారులు, పెద్ద కుటుంబాలకు అనువైనది. కొత్త జియో ఏఎక్స్ 6000 యూనివర్సల్ రూటర్ ధర దేశంలో రూ.5,999. ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, స్మార్ట్ గ్యాడ్జెట్లు వంటి బహుళ పరికరాలను ఒకేసారి హైస్పీడ్ ఇంటర్నెట్‌కు కనెక్ట్‌ చేసుకోవచ్చు. డ్యూయల్ బ్యాండ్ వైఫై, జియో ట్రూ ఏఐ మెష్ కవరేజ్, స్మార్ట్ హోమ్ కనెక్టివిటీ వంటి ఇతర ఫీచర్లను కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ రౌటర్ ఐపీ ఓవర్‌ డీహెచ్‌సీపీ కనెక్టివిటీని మాత్రమే సపోర్ట్ చేస్తుందని, ఐపీపీఓఈ, పీపీఓఈ కనెక్షన్ సెటప్ తో పనిచేయదని రిలయన్స్ తెలిపింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)