28న గచ్చిబౌలి కొండాపూర్ ఫ్లై ఓవర్ ప్రారంభం

Telugu Lo Computer
0


జూన్ 28వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండాపూర్ నుంచి గచ్చిబౌలి వరకు నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్నారు. శిల్ప లేఅవుట్ ఫేజ్ టు ఫ్లై ఓవర్ ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న నేపథ్యంలో ఈ మార్గంలో ప్రయాణించే వారికి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఈ ఫ్లైఓవర్ కు దివంగత కాంగ్రెస్ నేత పి జనార్దన్ రెడ్డి పేరు పెట్టాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఫ్లైఓవర్ 1.2 కిలోమీటర్ల పొడవుతో, 6 లేన్లతో విస్తరించి ఉంది. దీని నిర్మాణానికి సుమారు 178 కోట్లు ఖర్చయింది. ఈ ఫ్లైఓవర్ గచ్చిబౌలి జంక్షన్ వద్ద నిర్మించిన మూడవ ఫ్లైఓవర్. ఇప్పటికే ఇక్కడ గచ్చిబౌలి జంక్షన్ ఫ్లైఓవర్, శిల్ప లేఅవుట్ ఫేజ్ వన్ ఫ్లైఓవర్ ఉండగా ప్రస్తుతం శిల్పా లే అవుట్ ఫేజ్ టు ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది. ఇది అందుబాటులోకి వస్తే ముఖ్యంగా హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, వంటి ప్రాంతాలకు వెళ్లే వారికి ట్రాఫిక్ కష్టాలు తీరిపోతాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)