ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా మచిలీపట్నం, మంగినపూడి బీచ్ లో 'మసులా బీచ్ ఫెస్ట్-2025' అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్ర పర్యాటకశాఖమంత్రి కందుల దుర్గేశ్ ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. బీచ్ ఫెస్ట్ పర్యాటకులు, జిల్లావాసులకు వినోదం, ఆహ్లాదం, అన్ని రాష్ట్రాల రుచులను అందించనుంది. విద్యా, సాంస్కృతిక కేంద్రంగా స్వాతంత్య్ర, రాజకీయ చైతన్యానికి కేంద్ర బిందువుగా నిలిచిన మచిలీపట్నం చరిత్రను గుర్తు చేసేలా మంగినపూడిలో నాలుగు రోజులు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 5 నుంచి 8 వరకు సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు, జాతీయ స్థాయిలో సి-కయాకింగ్, కనోయింగ్ బీచ్ కబడ్డీ, వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నారు. 80 అడుగుల అమరావతి ఐకానిక్ టవర్, 100 అడుగుల ఎత్తులో జాతీయ పతాకం శాశ్వత నిర్మాణాలుగా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మంగినపూడి బీచ్ లో అట్టహాసంగా 'మసులా బీచ్ ఫెస్ట్-2025' ప్రారంభం
June 05, 2025
0
Tags