తెలుగు రాష్ట్రాల నుంచి తొలి వందే భారత్ స్లీపర్ రైలు విజయవాడ నుంచి అయోధ్య / వారణాసి వరకు కేటాయించాలని సూత్ర ప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ నుంచి వరంగల్ మీదుగా ప్రస్తుతం రెగ్యులర్ రైళ్లు ప్రయాణించే మార్గంలోనే వందే భారత్ స్లీపర్ ను అయోధ్య కు కేటాయించేలా నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది. రాత్రి సమయం లోనే ఈ రైలు ఉండేలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అదే విధంగా సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ కి వందేభారత్ స్లీపర్ రైలు ప్రతిపాదన పైన తుది కసరత్తు జరుగుతోంది. రైల్వే మంత్రికి నేరుగా ఈ రైలు కేటాయింపు కోసం వినతులు వస్తున్నాయి. అదే విధంగా విశాఖ నుంచి తిరుపతి, సికింద్రాబాద్ నుంచి తిరుపతి, సికింద్రాబాద్ నుంచి బెంగళూరుకు వందేభారత్ స్లీపర్ రైళ్ల కేటాయింపు కోసం రైల్వే శాఖకు ప్రతిపాదనలు అందాయి. కాగా, విజయవాడ నుంచి అయోధ్య, అదే విధంగా సికింద్రాబాద్ నుంచి తిరుపతికి రెండు వందే భారత్ స్లీపర్ రైళ్లను తొలి విడతలో కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మార్గా ల్లో రద్దీ.. ఆక్యుపెన్సీ...డిమాండ్ పరిగణలోకి తీసుకుంటున్నారు. ప్రస్తుతం తొలి విడత వందేభారత్ స్లీపర్ పట్టాలెక్కించేలా ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే, తొలి విడతలో ఏ మేరకు సాధ్యం అనే అంశం పైన అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. రైల్వే అధికారులు ఈ రెండు ప్రతిపాద నల్లో ప్రయాణీకుల డిమాండ్.. రద్దీ గురించి నివేదికలు ఇవ్వనున్నారు. రైల్వే మంత్రిత్వ శాఖ తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే, తొలి విడతలోనే వందేభారత్ స్లీపర్ తెలుగు రాష్ట్రాలకు కేటా యింపు ఖాయంగా కనిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాలకు రెండు వందేభారత్ స్లీపర్లు ?
May 02, 2025
0
Tags