అమెరికా లోని ఇలినాయీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్ ఏర్పాటుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అనుమతి మంజూరు చేసింది. ముంబైలో ఏర్పాటయ్యే ఈ క్యాంపస్ 2026 నుంచి కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, బిజినెస్ వంటి డిమాండున్న విభాగాల్లో గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను ప్రారంభించనుంది. చికాగో యూనివర్సిటీ క్యాంపస్‌లో మాదిరిగానే విద్యాపరంగా కఠినమైన, అనుభవ పూర్వక, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఉండే పాఠ్యాంశాలను బోధిస్తామని ఇలినాయీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రెసిడెంట్ రాజ్ ఎచంబడి తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ఎంపిక చేసే బోధనాసిబ్బంది, ఇలినాయీ టెక్ అమెరికా క్యాంపస్‌ల నుంచి విజిటింగ్ ప్రొఫెసర్లు కూడా ఉంటారన్నారు. యూకేకు చెందిన సౌతాంప్టన్ యూనివర్సిటీ ఈ ఏడాదిలోనే భారత్‌లో క్యాంపస్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తోంది. ఆస్ట్రేలియాకు చెందిన డీకిన్, వొల్లొన్‌గాంగ్ వర్సిటీలు ఇప్పటికే గుజరాత్‌లో పనిచేస్తున్నాయి.
ఇలినాయీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్ ఏర్పాటుకు యూజీసీ అనుమతి
May 09, 2025
0
Tags