జూన్ 6 వరకు తహవ్వుర్ రాణా జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

Telugu Lo Computer
0


ముంబై ఉగ్రదాడుల (26/11) కేసులో ప్రధాన నిందితుడు తహవ్వుర్ రాణా జ్యుడిషియల్ కస్టడీని జూన్ 6వ తేదీ వరకూ పొడిగించారు. శుక్రవారంనాడు ఆయనను భారీ భద్రత మధ్య పాటియాలా హౌస్ కోర్టు ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ వైభవ్ కుమార్ ముందు హాజరుపరిచారు. వాయిస్, హ్యాండ్ రైటింగ్ నమూలాలు ఇచ్చేందుకు తహవ్వుర్ రాణా పూర్తిగా సహకరించినట్టు ఆయన తరఫు లీగల్ ఎయిడ్ అడ్వకేట్ పీయూష్ సచ్‌దేవ్ కోర్టుకు తెలిపారు. ఎన్ఐఏ అభ్యర్థ మేరకు రాణా నుంచి ఈ శాంపుల్స్ తీసుకునేందుకు న్యాయమూర్తి చందర్ జిత్ సింగ్ సారథ్యంలోని ఎన్ఐఏ కోర్టు ఇటీవల ఆమోదం తెలిపింది. రాణాను విచారించేందుకు మరికొంత సమయం కావాలని ఎన్ఐఏ ఇటీవల కోరడంతో ఆయనను 12 రోజుల ఎన్ఐఏ కస్టడీకి కోర్టు అంగీకరించింది. 64 ఏళ్ల రాణాను 26/11 దాడుల కేసులో అమెరికా నుంచి ఇటీవల ఎన్ఐఏ టీమ్ భారత్ తీసుకువచ్చింది. అప్పట్నించి ఆయన న్యూఢిల్లీలోని ఎన్ఐఏ కస్టడీలో ఉన్నారు. పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తొయిబా ఉగ్రవాదులతో ఆయన సబంధాలు కొనసాగించినట్టు ఎన్ఐఏ ప్రధాన ఆరోపణగా ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)