ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ నివాసి రాజ్‌కుమార్ మిశ్రా లండన్ లోని వెల్లింగ్ బరో నగర మేయర్ గా ఎన్నికయ్యారు. రాజ్‌కుమార్ మిశ్రా మీర్జాపూర్ జిల్లా సదర్ తహసీల్‌లోని భటేవ్రా గ్రామ నివాసి. ఐదు సంవత్సరాల క్రితం ఎం.టెక్ చేయడానికి లండన్ వెళ్ళారు. చదువు పూర్తయిన తర్వాత అక్కడే పని చేయడం ప్రారంభించారు. బ్రిటిష్ పౌరసత్వం తీసుకున్నారు. రెండు నెలల క్రితం ఆయన లేబర్ పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీ చేసి ఏప్రిల్ 3న కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ఈ విజయం తర్వాత, ఏప్రిల్ 12న పార్టీ ఆయనను వెల్లింగ్‌బరో నగర మేయర్‌గా ఎన్నుకుంది. రాజ్ కుమార్ మిశ్రా తాజాగా లండన్ నుంచి తన వీడియోను విడుదల చేశారు. మేయర్‌గా ఎన్నికయ్యారనే వార్త వినగానే, మీర్జాపూర్‌లోని ఆయన ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది.
వెల్లింగ్ బరో నగర మేయర్‌గా ఎన్నికైన భారతీయుడు
May 16, 2025
0
Tags