చంద్రుడు నుంచి భారీ ఎత్తున సోలార్ పవర్‌ను భూమ్మీదికి తీసుకొచ్చే ప్రయోగాన్ని దుబాయ్ చేపట్టింది. ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసి ప్రాజెక్టును మొదటి దశలో ముందుకు తీసుకెళుతుంది. అంతరిక్షంలో చంద్రుడి చేట్టూ పదివేల కిలోమీటర్ల మేర సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తారు. రోజులో ఏదో ఒకచోట చంద్రుడిపై సూర్య రశ్మి పడుతుంది కాబట్టి నిరంతరం అక్కడ విద్యుత్ సరఫరా అవుతుంది. అయితే సూర్యుడి నుంచి ఈ సోలార్ పవర్ ని భూమి మీదకి తీసుకురావడానికి ఒక ఉపగ్రహాన్ని చంద్రుడి కక్షలోకి ప్రవేశపెడతారు. దుబాయిలో ఇప్పటికే ఏర్పాటు చేసిన మహమ్మద్ అల్ రషీద్ సోలార్ పార్క్‌లో ఉన్న రిసీవర్‌కి ఈ ఉపగ్రహం వైర్లెస్ పద్ధతిలో సోలార్ పవర్‌ని పంపిస్తుంది. అక్కడ నుంచి రిటైల్‌గా క్లీన్ సోలార్ పవర్‌ని దుబాయ్ వాడుకుంటుంది. దీంతో 2030 నాటికి దుబాయ్ దేశానికి మొత్తం వంద శాతం చంద్రుని పై నుంచి వచ్చిన సోలార్ పవర్‌ని వినియోగించుకునే దిశగా ముందుకు వెళుతుంది. ప్రతిరోజు 5000 మెగావాట్లు ప్రొడ్యూస్ చేయాలనేది లక్ష్యంగా పెట్టుకుంది. ఇక 2070 నాటికి అంచలంచలుగా పవర్ ప్రొడక్షన్ పెంచుకుంటూ వెళ్లి ప్రపంచ దేశాల్లో ఎక్కడికక్కడ రిసీవర్లు ఏర్పాటు చేసి.. వారికి కావలసిన విద్యుత్‌ను వైర్లెస్ పద్ధతిలో అందించనుంది. దీని ద్వారా మరో 40 ఏళ్లలో దుబాయ్ వరల్డ్ పవర్ హబ్‌గా మారుతుంది. ఇదే ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే వెతుక్కోవడం అంటే. ప్రపంచానికి పెట్రోల్ బంక్‌గా ఉన్న దుబాయ్ ఇకపై సబ్ స్టేషన్‌గా మారనుంది.
చంద్రుడు నుంచి సోలార్ పవర్‌ను భూమ్మీదికి తీసుకొచ్చే ప్రయోగాన్ని చేపట్టిన దుబాయ్
May 22, 2025
0
Tags