పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అరెస్ట్ ?

Telugu Lo Computer
0


పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ అరెస్ట్ అయినట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరోవైపు పాకిస్తాన్ ప్రధాని, ఇతర ఆర్మీ అధికారులతో కలిసి బహ్రెయిన్ పారిపోతున్నట్లు సమాచారం అందుతోంది. పాకిస్తాన్ లో రాష్ట్రపతి పాలన దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భారత నేవీ పాకిస్తాన్ ను వణికిస్తోంది. రంగంలోకి 26 యుద్ధ నౌకలు దిగాయి. ఇప్పటికే కరాచీ పోర్టుపై ఐఎన్ఎస్ విక్రాంత్ దాడి చేసింది. 1971 తర్వాత కరాచీపై భారత నేవీ దాడులు జరగడం ఇదే తొలిసారి. భారత్ దాడికి కరాచీలో 10 పోర్టులు ధ్వంసం అయినట్లు సమాచారం. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత్, పాకిస్తాన్ లోని లాహోర్, సియోల్ కోట్, పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ నగరాలపై అటాక్ ప్రారంభించింది. అక్కడి పాకిస్తాన్ క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేస్తోంది. మరోవైపు పాకిస్తాన్ ​ జమ్మూపై హమాస్ తరహా డ్రోన్ దాడులకు పాల్పడుతోంది. అయితే భారత వాయు సేన పాక్ ప్రయోగించిన దాదాపు 8 క్షిపణులు, డ్రోన్​లను కూల్చేసింది. మరోవైపు భారత్-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్న వేళ అనేక రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. సరిహద్దు జిల్లాల్లో ఇప్పటికే విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. పాఠశాలలు మూసివేశారు. పోలీసు సిబ్బంది, ఇతర అధికారుల సెలవులను రద్దు చేశారు. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్‌ తో సహా పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌, ఢిల్లీ, గుజరాత్‌, పశ్చిమ బెంగాల్‌, బీహార్‌ రాష్ట్రాలు చర్యలు చేపడుతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)