ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా హాలహర్వి మండలం చింతకుంట గ్రామ శివారులో కట్రవంక వాగు ఉద్ధృతి పెరగడంతో ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలకు రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఎగువన భారీ వర్షం కురవడంతో వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా వంతెన పనులు చేస్తుండటంతో చింతకుంటలో తాత్కాలిక వంతెన ఏర్పాటు చేశారు. దీనిపై నీటి ప్రవాహంతో ఒకట్రెండు రోజులపాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని గ్రామస్థులు తెలిపారు. ఏళ్లు గడుస్తున్నా వంతెన పనులు పూర్తి కావడం లేదని స్థానికులు వాపోయారు
ఆంధ్రా - కర్ణాటక రాష్ట్రాలకు తాత్కాలికంగా నిలిచిపోయిన రాకపోకలు
May 18, 2025
0
Tags