ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలోని పీలేరు సదుం రోడ్డులో కారు అదుపుతప్పి బావిలో పడిపోయింది. ఈ ఘటనలో కర్ణాటక కు చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. ఆదివారం ఉదయం వెలుగు చూసిన ఈ విషాదకర ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కారు అర్ధరాత్రి సమయంలో రోడ్డు పక్కన ఉన్న బావిలోకి దూసుకెళ్లి పడడంతో కారులో ఉన్న ముగ్గురు మృతి చెందారు. స్థానికులు కారును బావిలోంచి బయటకు తీశారు. మృతులు ఎవరన్నది తెలియ రాలేదు. కర్ణాటక రిజిస్ట్రేషన్ నెంబర్ తో కారు ఉందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పీలేరులో కారు అదుపుతప్పి బావిలో పడి ముగ్గురు దుర్మరణం
May 18, 2025
0
Tags