హైదరాబాద్ గుల్జార్ హౌస్ అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు 'ఎక్స్' ద్వారా వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారం అందిస్తామని స్పష్టం చేశారు. కాగా భారీ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 17కి చేరింది. ప్రాథమిక సమాచారం మేరకు షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
గుల్జార్ హౌస్ అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి
May 18, 2025
0
Tags