ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి మరోసారి తన కల్లోలాన్ని చూపిస్తోంది. తాజాగా గుంటూరు జిల్లా తాడేపల్లి లోని మణిపాల్ ఆస్పత్రిలో నిర్వహించిన పరీక్షల్లో ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈమూడు కేసుల్లో ఏలూరుకు చెందిన భార్యాభర్తలు మరియు తెనాలికి చెందిన 83 ఏళ్ల వృద్ధుడు ఉన్నారు. అధికారిక సమాచారం మేరకు వీరంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వృద్ధుడి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అతనికి తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు తలెత్తినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అతనికి ఐసీయూలో ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. మిగతా ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ, ముందు జాగ్రత్తగా వారిని కూడా ప్రత్యేక విభాగంలో ఉంచారు. వీరి ద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా చక్కటి నియంత్రణ చర్యలు చేపట్టాలని అధికారులు సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు కరోనా కేసులు నమోదు
May 27, 2025
0
Tags