కానిస్టేబుల్ అని నమ్మించి పెళ్లి చేసుకున్న హోంగార్డు : అశ్లీల వీడియోలు చూపించి భార్యను చిత్ర హింసలకు గురిచేసిన వైనం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని పాత గుంటూరుకు చెందిన యువతి బీఎస్సీ పూర్తి చేసింది. 8 నెలల క్రితం అలీనగర్‌కు చెందిన ఫణీంద్రకుమార్‌తో పెళ్లి జరిగింది. పెళ్లి సమయంలో ఫణీంద్రకుమార్‌ తాను కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నానని నమ్మించి పెళ్లి చేసుకున్నాడు. కానిస్టేబుల్ సంబంధం కావడంతో కుటుంబ సభ్యులు అంతా పెళ్లిని అంగరంగ వైభవంగా చేశారు. పెళ్లైన తర్వాత అత్తారింటికి వెళ్లింది. అక్కడ భర్త భాగోతం వెలుగులోకి వచ్చింది. ఫణీంద్రకుమార్ కానిస్టేబుల్ కాదని హోంగార్డు అని తెలిసి భార్య ఆవేదన వ్యక్తం చేసింది. అయినా పర్వాలేదని భరించి సర్థుకుని జీవిస్తోంది. అశ్లీల వీడియోలు చూపిస్తూ చిత్రహింసలు పెడుతూ  భర్త ఫణీంద్రకుమార్ సైకోలా ప్రవర్తించేవాడని బాధితురాలు వాపోయింది. కానిస్టేబుల్ అని మోసం చేసి పెళ్లి చేసుకోవడమే కాకుండా తనను చిత్రహింసలకు గురి చేసేవాడని వాపోయింది. ఇక పడకగదిలో అయితే నరకం చూపించేవాడని వాపోయింది. అశ్లీల వీడియోలు చూపిస్తూ శారీరకంగా చిత్రహింసలకు గురిచేసేవాడని పోలీసుకు చేసిన ఫిర్యాదులో వాపోయింది. అశ్లీల వీడియోలు చూపిస్తూ తీవ్రంగా హింసించేవాడని, కొన్నిసార్లు రక్తం వచ్చేలా గాయపరిచి, మూత్రం కూడా తాగించాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. భర్త ఆగడాలను మామ దగ్గర చెప్పుకుని తన భర్తను మార్చాలని కోరుదామంటే అతడి కూడా దుర్మార్గుడేనని బాధితురాలు ఫిర్యాదులో ఆరోపించింది. భర్త ఇంట్లో లేని సమయాల్లో తన మామ కూడా తనతో అసభ్యంగా ప్రవర్తించేవాడంటూ బోరున విలపించింది. అటు భర్త ఇటు మామ వేధింపులు తట్టుకోలేక ఇటీవలే పుట్టింటికి వచ్చేసినట్టు బాధితురాలు పేర్కొంది. మూడేళ్ల క్రితం పొత్తూరుకు చెందిన మహిళతో పెళ్లి ఇదిలా ఉంటే ఫణీంద్రకుమార్ మరో మహిళతో ఉన్న ఫోటో ఒకటి బాధితురాలి కంటపడింది. ఈ ఫోటోపై ఆరా తీయగా వేధింపులు మరింత తీవ్రమైనట్లు తెలిపింది. ఆఫోటోలోని మహిళ అతడి మెుదటి భార్య అని తమకు తెలిసిందని వాపోయింది. ఫణీంద్రకుమార్‌కు మూడేళ్ల క్రితమే పొత్తూరుకు చెందిన మరో మహిళతో వివాహమైందని....ఆ విషయాన్ని దాచిపెట్టి తనను రెండో పెళ్లి చేసుకున్నాడని బాధితురాలు వాపోయింది. ఈ మోసం గురించి నిలదీయడంతో తనపై దాడికి పాల్పడటంతోపాటు దుర్భాషలాడుతూ చిత్రహింసలకు గురిచేశాడని పోలీసుల ఎదుట కన్నీళ్లు పెట్టింది. ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదుఅత్తారింటి వేధింపుల నేపథ్యంలో బాధితురాలు సోమవారం తన తల్లితో కలిసి గుంటూరు పోలీసు కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)