ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం : అన్నదాత సుఖీభవ పథకం కింద 20 వేలు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సు ల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని, అలాగే అన్నదాత సుఖీభవ పథకం కింద 20 వేల చొప్పున ఇస్తామని కడప టిడిపి మహానాడులో సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు. కేంద్రం అందించే 6000 రూపాయలతో కలిపి మూడు విడుదల్లో ఈ ఏడాది అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని వెల్లడించారు. చంద్రబాబు మహానాడు వేదికపై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, ఆ తరువాత జ్యోతి ప్రజ్వలన చేసి, జెండా ఆవిష్కరించి మహానాడును ప్రారంభించారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా అదే జోరు అదే హోరు అన్నారు చంద్రబాబు. ఎన్నికలై ఏడాది గడిచినా టీడీపీ శ్రేణుల్లో అదే ఉత్సాహం కనిపిస్తోందని పేర్కొన్నారు. నా జీవితంలో 34 మహానాడులను చూశానని, కానీ ఇప్పుడు దేవుని గడపలో జరుగుతున్న ఈ మహానాడు చరిత్ర సృష్టించబోతుందని వివరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)