బొలెరో ట్రాలీని లారీ ఢీకొనడంతో నలుగురు మృతి

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా వినుకొండ మండలం శివాపురం వద్ద బొప్పాయి కాయల లోడ్‌తో వెళ్తున్న బొలెరో ట్రాలీని లారీ ఢీకొనడంతో నలుగురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలిలో ముగ్గురు మృతి చెందగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు చనిపోయారు. మృతులంతా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గడ్డమీదపల్లికి చెందిన వ్యవసాయ కూలీలు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు.  

Post a Comment

0Comments

Post a Comment (0)