ఇంటర్న్‌షిప్ ఇప్పిస్తానని నమ్మించి అమ్మాయిపై గ్యాంగ్ రేప్

Telugu Lo Computer
0


హైదరాబాద్‌లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్‌ పరిధిలో యువతిని  ఇద్దరు యువకులు రేప్ చేశారు.  చెన్నైలో బయోమెడికల్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థినికి ఇంటర్న్‌షిప్ ఇప్పిస్తానని నమ్మించి అజయ్ అనే యువకుడు హైదరాబాద్‌కు పిలిపించాడు. హైదరాబాద్‌కు వచ్చి కూకట్‌పల్లిలోని లేడీస్ హాస్టల్లో ఉంటున్న సదరు యువతిని పార్టీ చేసుకుందామని, తన స్నేహితుడు హరి ఫ్లాట్‌కు రావాలని రిక్వెస్ట్ చేశాడు. అజయ్ పిలుపు మేరకు నిజాంపేటలో రాజీవ్ గృహకల్పలోని హరి ఫ్లాట్‌కు వెళ్లింది. ఫ్లాట్‌కు వెళ్లిన తర్వాత యువతికి బలవంతంగా మద్యం తాగించి, మత్తులోకి వెళ్లగానే అజయ్, హరి ఇద్దరూ కలిసి ఆమెను రేప్ చేశారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బాచుపల్లి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)