ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తి పట్టణం సన్నిధి వీధిలోని రాఘవేంద్ర స్వామి మఠంలో ఈనెల 29న హీరో శ్రీకాంత్ కుటుంబం నవగ్రహ శాంతి పూజలు చేయించుకున్నారు. ముక్కంటి ఆలయంలో పనిచేసే కొందరు అర్చకులు, వేద పండితులు శ్రీకాంత్‌కు ప్రైవేటుగా పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. శ్రీకాళహస్తి ఆలయ అర్చకులు బయట ఎక్కడా కూడా ఇలాంటి పూజలు చేయకూడదు అనే నిబంధనలు ఉన్నాయి. అలా కాకుండా ప్రైవేటుగా ఇలాంటి పూజలు చేసినప్పుడు సదరు అర్చకులపై దేవాదాయ శాఖ చట్టం ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేటుగా నవగ్రహ శాంతి పూజలు నిర్వహించిన వ్యవహారంపై శ్రీకాళహస్తి ఆలయ అర్చకుడిపై ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే, ఆలయ అధికారులు విచారణ జరిపి, సంబంధిత వేద పండితుడిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
శ్రీకాళహస్తి పండితుడిపై సస్పెన్షన్ వేటు !
May 31, 2025
0
Tags