హైదరాబాద్, షేక్ పేటలో ఏపీఏహెచ్‌సీ కాలనీకి చెందిన డాక్టర్ చిగురుపాటి నమ్రత (34) సిటీలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్నారు. అయితే, కొన్నేళ్లుగా ఆమె డ్రగ్స్ తీసుకుంటూ మత్తు పదార్థాలకు బానిసగా మారిపోయారు. ఈ క్రమంలో ముంబైలో నివాసం ఉండే వాన్స్ టక్కర్‌ను వాట్సాప్ ద్వారా సంప్రదించి, రూ.5 లక్షల కొకైన్ డ్రగ్స్ ఆర్డర్ చేసింది. డబ్బును మొత్తం ఆన్ లైన్ ద్వారా పంపించింది. అనంతరం, టక్కర్ తన వద్ద డెలివరీ బాయ్‌గా పనిచేసే బాలకృష్ణ రాంప్యార్ రామ్ (38)కు డ్రగ్స్ ఇచ్చి నగరానికి పంపించాడు. రాయదుర్గంలో నమ్రతను కలిసిన రాంప్యార్ రామ్ డ్రగ్స్ ను అందజేస్తుండగా పక్కా సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. డ్రగ్స్ ఇస్తున్న సమయంలో వారిద్దరిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నిందితుల నుంచి 53 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
డ్రగ్స్‌కు బానిసైన డాక్టర్ నమ్రతను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు !
May 10, 2025
0
Tags