భారత్-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో యాత్రికుల రక్షణ దృష్ట్యా తాత్కాలికంగా ఛార్ ధామ్ యాత్రను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా శనివారం ఉదయం మీడియాకు ప్రకటించింది. యాత్ర ఎప్పటి వరకు రద్దు, తిరిగి ఎప్పుడు ప్రారంభించే విషయాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొంది. భారత్ - పాకిస్తాన్ సంబంధాలు తారాస్థాయికి చేరుతున్న వేళ, సరిహద్దుల్లో హైఅలెర్ట్ ప్రకటించబడింది. పాకిస్తాన్ నుండి ఉగ్రదాడుల ముప్పు ఉన్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, నేషనల్ సెక్యూరిటీ అథారిటీస్, ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి ఈ యాత్రను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించాయి. గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ ధామ్ పరిసరాల్లో భారీ సంఖ్యలో సైనిక బలగాలు మోహరించాయి. ఎన్‌ఎస్‌జీ, ఆర్మీ, పారామిలిటరీ బలగాలతో పాటు డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రతి ధామ్‌కు వెళ్లే ప్రధాన రహదారులను పూర్తిగా మూసివేసి భద్రతా వలయంగా మార్చారు. ఈ చర్యలన్నీ ఉగ్రదాడుల అవకాశాన్ని నిరోధించడానికి తీసుకుంటున్నారని అధికారులు స్పష్టం చేశారు.
తాత్కాలికంగా ఛార్ ధామ్ యాత్ర రద్దు
May 10, 2025
0
Tags