రైలు పట్టాలపై రాళ్లు - గూడ్సు రైలుకు తప్పిన ప్రమాదం

Telugu Lo Computer
0


మిళనాడులోని తిరుప్పూరు - వంజిపాళయం మధ్య కావిలిప్పాళయం సమీపంలో రైలు పట్టాలపై గుర్తు తెలియని దుండగులు రాళ్లను ఉంచారు. ఆ మార్గంలో వెళ్ళిన గూడ్సురైలు కింద ఆ రాళ్లు నలుగుతూ పెద్ద శబ్దం రావటంతో లోకోపైలట్‌ వెంటనే రైల్వే ఉన్నతాధికారులకు ఫోన్‌ చేశారు. దీంతో శుక్రవారం వేకువజామున రైల్వే భద్రతా దళం ఎస్‌ఐ రువంతికా, పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. ఆ పట్టాల వద్ద పెద్ద రాళ్లు గూడ్సురైలు చక్రాల కింద నలిగి ఉండటాన్ని గమనించారు. సంఘటన స్థలానికి చేరువగా టాస్మాక్‌ దుకాణం ఉండటంతో మద్యం మత్తులో ఎవరైనా ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)