తూర్పు మధ్య అరేబియా సముద్రంపై ఆవర్తన ప్రభావం ఏర్పడింది. మరో వైపు బంగాళాఖాతంలో అల్ప పీడనం కొనసాగుతోంది. ఫలితంగా రానున్న రెండు రోజుల్లో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈనెల 27న పశ్చిమ మధ్య, సమీప ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో మరో అల్పపీడన ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అటు అరేబియాలో ద్రోణి తోడు కావటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా వర్షాలు కొనసాగుతున్నాయి. తెలంగాణలోని అదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ రోజు తెలంగాణలోని ఆరు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. పలు ప్రాంతాల్లో మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఇది ఉత్తర దిశగా కదులుతూ శుక్రవారం సాయంత్రానికి వాయుగుండంగా బలపడే అవకాశముంద ని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఈనెల 27వ తేదీ నాటికి పశ్చిమమధ్య బంగా ళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తరువాత రెండు రోజుల్లో బలపడి తుఫాను గా మారే అవకాశం బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్లూరి సీతారా మరాజు, పార్వతీపురం మన్యం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.
బంగాళాఖాతంలో అల్పపీడనం
May 23, 2025
0
Tags