విజయవాడ నగరంతో పాటు తాడిగడప పెనమలూరు పోరంకి ప్రాంతాల్లో సుమారు 15 మంది బంగ్లాదేశ్ లోని మయన్మార్ కు చెందిన యువకులు ఉన్నట్టు విజయవాడలోని కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులకు సమాచారం అందింది. 15 మంది యువకుల్లో 8 మంది ఈ ఏడాది జనవరిలో నగరానికి వచ్చినట్టు, మిగతా ఏడుగురు నిన్న రాత్రి వచ్చినట్టు గుర్తించారు.ఉగ్ర లింకులు రాష్ట్రంలో బయట పడటంతో బంగ్లాదేశ్ యువకుల కదలికలపై పోలీసుల దృష్టి పెట్టారు. మొత్తం15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగర పరిసర ప్రాంతాల్లో భవన నిర్మాణ కార్మికులుగా వీరు పనిచేస్తున్నట్టు గుర్తించారు. అందర్నీ రహస్య ప్రాంతానికి తీసుకువెళ్లి విచారిస్తున్నారు.
విజయవాడ పోలీసుల అదుపులో 15 మంది బంగ్లాదేశ్ యువకులు
May 23, 2025
0
Tags