చెన్నైలోని ఓజోన్ టెక్నో పార్క్‌లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ దాదాపు 6,30,000 చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకుంది. దీనికి నెలవారీ అద్దె రూ. 2.8 కోట్లు అని.. రియల్ ఎస్టేట్ డేటా అనలిటికల్ సంస్థ ప్రాప్‌స్టాక్ ద్వారా తెలిసింది. చెన్నైలోని నవలూర్‌లో టీసీఎస్ ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకుంది. అద్దె 2025 మార్చి 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ స్థలాన్ని ప్లాటినం హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 10 సంవత్సరాలకు లీజుకు తీసుకుంది. దీని కోసం టీసీఎస్ రూ. 25.5 కోట్లు డిపాజిట్ చేసినట్లు సమాచారం. అద్దె నెలకు చదరపు అడుగుకు రూ. 45 చొప్పున చెల్లించాల్సి ఉంది. అయితే ప్రతి మూడు సంవత్సరాల తర్వాత అద్దె 12 శాతం పెరుగుతుంది. అయితే ఈ విషయంపై టీసీఎస్ అధికారికంగా స్పందించలేదు.
చెన్నైలోని ఓజోన్ టెక్నో పార్క్‌లో టీసీఎస్ కొత్త ఆఫీస్
May 12, 2025
0
Tags